మదపుటేనుగు ‘బిన్ లాడెన్’ మృతి!

  • ఐదుగురి ప్రాణాలు బలిగొన్న ఏనుగు
  • మత్తుమందు ఇచ్చి బంధించిన అధికారులు
  •  మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు కమిటీ
మదపుటేనుగు ‘బిన్‌లాడెన్’ మృతి చెందింది. ఐదుగురు వ్యక్తుల ప్రాణాలు తీసిన ఈ ఏనుగును బంధించేందుకు గత కొన్ని రోజులుగా అటవీ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఈ నెల 11న విజయవంతమయ్యాయి. పశ్చిమ అసోంలోని గోల్‌పారా జిల్లా రాంగ్‌జూలీ అటవీ ప్రాంతంలో కనిపించిన ‘బిన్‌లాడెన్’కు మత్తుమందు ఇచ్చి బంధించారు.

 అనంతరం దానిని జనసంచారం లేని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలని అధికారులు నిర్ణయించారు. అయితే, ఆ తర్వాత నిర్ణయం మార్చుకుని ఓరంగ్ నేషనల్ పార్క్‌కు తరలించారు. ఆ ఏనుగు సృష్టించిన బీభత్సాన్ని చూసి స్థానికులు దానికి ఉగ్రవాది బిన్ లాడెన్ పేరును పెట్టారు. ఆ తర్వాత అధికారులు ఈ ఏనుగుకు ‘కృష్ణ’ అని నామకరణం చేశారు.

ఓరంగ్ పార్క్‌లో వదిలినప్పటి నుంచీ ఆరోగ్యంగానే ఉన్నట్టు కనిపించిన ‘కృష్ణ’ నిన్న తెల్లవారుజామున మృతి చెందింది. విషయం తెలిసిన ప్రభుత్వం దాని మృతికి గల కారణాలను కనుగొనేందుకు అధికారులను నియమించింది.

elephant
bin laden
krishna
assam

More Telugu News