కడప జిల్లాలో మూడ్రోజుల పాటు పర్యటించనున్న చంద్రబాబు

  • చంద్రబాబు కడప జిల్లా పర్యటన ఖరారు
  • ఈ నెల 25 నుంచి 27 వరకు పర్యటన
  • కార్యకర్తలు, నేతలతో సమీక్షలు
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణుల్లో నవ్యోత్సాహం కలిగించేందుకు, వారిలో భరోసా నింపేందుకు జిల్లాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి కార్యకర్తలు, నేతలతో సమావేశమైన ఆయన ధైర్యం కలిగించేలా మాట్లాడారు. తాజాగా, కడప జిల్లాలో పర్యటించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 25 నుంచి 27 వరకు మూడ్రోజుల పాటు ఆయన కడప జిల్లాలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జిల్లా నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.
Go Back to Shorts
Kadapa District
Chandrababu
Telugudesam

More Telugu News