కుమార్తెకు న్యాయం జరగలేదని ఆత్మహత్య చేసుకున్న తండ్రి!
- మహబూబాబాద్ సమీపంలో ఘటన
- ప్రేమ పేరిట లోబరచుకుని గర్భవతిని చేసిన యువకుడు
- న్యాయం చేస్తామని చెప్పి, మొహం చాటేసిన గ్రామ పెద్దలు
తన కుమార్తెకు తీవ్రమైన అన్యాయం జరిగిందని, న్యాయం చేస్తానన్న పెద్దలు ముఖం చాటేశారన్న మనస్తాపంతో ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ లో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానం చెర్లలో బాధితురాలి కుమార్తెను ప్రేమ పేరిట ఓ యువకుడు నమ్మించాడు. ఆమెను లోబరచుకుని, గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించాడు. ఆ యువతి విషయాన్ని తండ్రికి చెప్పగా, అతను గ్రామ పెద్దలను ఆశ్రయించాడు. న్యాయం జరిపిస్తామని చెప్పిన పెద్దలు, ఆపై దూరం జరగడంతో బాధితురాలి తండ్రి గ్రామ శివారులో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.