నిత్యావసర వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగిపోతున్నాయి: దేవినేని ఉమ

  • టీడీపీ పాలనలో సామాన్యులపై ధరల భారం వేయలేదు
  • పేదలపై మోపిన భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి
  • ఆర్టీసీ ఛార్జీల పెంపుపై జగన్ సమాధానం చెప్పాలి
జగన్ ప్రభుత్వ పాలనలో ఏపీలో నిత్యావసర వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగిపోతున్నాయని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. టీడీపీ పాలనలో సామాన్యులపై ధరల భారం వేయలేదని ఆయన అన్నారు. ఛార్జీల పెంపుపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని, పేదలపై మోపిన భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై జగన్ సమాధానం చెప్పాలని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లిక్కర్, ఇసుక, బెట్టింగ్ మాఫియా నడుస్తోందని ఆయన ఆరోపించారు. అమరావతి అంతా 144, రాష్ట్ర మంతా సెక్షన్ 30 అమల్లో ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
devineni
Telugudesam
YSRCP

More Telugu News