మేము మీ ఇంట్లో కట్టేసిన కుక్కలమో, బర్రెలమో కాదు: జీవితా రాజశేఖర్

  • మాలో గొడవలు జరిగితే మా కంటే ముందు మీడియాకే తెలుస్తుంది
  • ఇందులో దాచాల్సింది ఏదీ లేదు
  • ప్రతి చోట గొడవలు ఉంటాయి
'మా' డైరీ ఆవిష్కరణలో జరిగిన గొడవపై జీవితా రాజశేఖర్ స్పందించారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. 'మాలో గొడవలు జరిగితే మా కంటే ముందు మీడియాకే తెలుస్తుంది. ఇందులో దాచాల్సింది ఏదీ లేదు. ప్రతి చోట గొడవలు ఉంటాయి. మేము కూడా అందరిలా మనుషులమే. సోషల్ మీడియా, మీడియాల్లో ఎన్నో రాస్తుంటారు. మేము మీ ఇంట్లో కట్టేసిన కుక్కలమో, బర్రెలమో కాదు. మాపై ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేయొద్దు. కావాలంటే మా సినిమాలపై మీరు కామెంట్లు చేయొచ్చు. మాపై కాదు. మీ అందరికీ తెలుసు రాజశేఖర్ గురించి. ఆయన మనసులో ఏముందో అది చెప్పడం తప్ప ఆయనకు మనసులో ఏదో దాచుకోవడం తెలియదు. కొన్ని సమస్యలు ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి'

'ఇక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ పరిష్కరించుకోవాలి. అందుకే రాజశేఖర్ ఇలా మాట్లాడారు. నరేశ్ కి కూడా నేను ఇదే చెబుతున్నాను. అందరితో కలిసి మేము పని చేస్తాం. ఇది జస్ట్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం. 'మా'ను చిరంజీవి ముందుండి నడిపించాలి' అని జీవిత అన్నారు. లోపాలు ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలని, బయటకు తీసుకురావద్దని అన్నారు. రాజశేఖర్ తరఫున తాను క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు.
Go Back to Shorts
jeevitha
rajashekar

More Telugu News