మీ వాడికి అంత సీన్ లేదు అని అర్థం అయ్యింది: విజయసాయికి బుద్ధా వెంకన్న కౌంటర్

  • విజయసాయిరెడ్డికి బుద్ధా వెంకన్న కౌంటర్ 
  • మీరు, మీ జగన్ గారు 2020లో ఉన్నారు కదా?
  • మీ దమ్ము, సత్తా సీబీఐ, ఈడీ ముందు చూపించండి 
  • ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను సంతలో గొర్రెల్లా కొన్నారు
'ఇంకా 1990ల్లోనే ఉంటే ఎలా బాబూ!' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.

'విజయసాయిరెడ్డి గారు.. మీరు, మీ జగన్ గారు 2020లో ఉన్నారు కదా మీ దమ్ము, సత్తా సీబీఐ, ఈడీ ముందు చూపించండి. అప్పుడు ఎవరు ఏ కాలంలో ఉన్నారో తేలిపోతుంది. మొన్నటి వరకూ 151 అని కాలర్ ఎగరేశావ్. ఇప్పుడు గేట్లు ఎత్తమంటారా? అనే స్థితికి వచ్చారు' అని ట్వీట్ చేశారు.

'బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్తే తడుపుకొని మండలి రద్దు చేసిన మీరా దమ్ము, ధైర్యం గురించి మాట్లాడేది? 151 మంది ఉన్నాం అని చెప్పి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను సంతలో గొర్రెల్లా కొన్నప్పుడే మీ వాడికి సీన్ లేదు అని అర్థం అయ్యింది' అని బుద్ధా వెంకన్న అన్నారు.

Go Back to Shorts
YSRCP
Telugudesam
budda venkanna

More Telugu News