ప్రభుత్వ ఏర్పాటుకు కారణమైన నన్ను కాదని.. ఓడిన వ్యక్తికి డిప్యూటీ సీఎం పదవా?: కర్ణాటక బీజేపీ నేత హెచ్.విశ్వనాథ్

  • సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి తప్పు చేయలేదు
  • ఎన్నికల్లో ఓడినవారికి మంత్రి పదవులు
  • ఇచ్చిన హామీని యడియూరప్ప నిలబెట్టుకుంటారని భావిస్తున్నా
బీజేపీ అధిష్ఠానంపై కర్ణాటక బీజేపీ నేత హెచ్.విశ్వనాథ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కారణమైన తమను కాదని, ఎన్నికల్లో ఓడిన లక్ష్మణ సవదికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు. తనకు మంత్రి పదవి దక్కినా, దక్కకపోయినా రాజకీయ చివరి అంకంలో ఓడిపోననే నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన సందర్భంలో యడియూరప్ప తమకు హామీ ఇచ్చారని, ఆ హామీని ఆయన నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చాలని భావించి విజయం సాధించామని, ఈ విషయంలో తప్పు చేసినట్టు భావించడం లేదని విశ్వనాథ్ స్పష్టం చేశారు.  
Go Back to Shorts
Karnataka
H.vishwanath
BJP

More Telugu News