ఈ నెల 10 తర్వాత మరోసారి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తా: పవన్ కల్యాణ్

  • రైతుల ఆందోళనలకు యాభై రోజులు పూర్తయ్యాయి
  • రైతులు, ఆడపడచుల స్ఫూర్తికి తెలుగు వాళ్లు గర్విస్తున్నారు
  • రైతుల ఉద్యమానికి మరోసారి సంపూర్ణ మద్దతు
రాజధాని అమరావతిని తరలించవద్దంటూ రైతులు, ఆడపడచులు నిరాహారదీక్షలు, ఆందోళనలు మొదలుపెట్టి యాభై రోజులు పూర్తయ్యాయని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులు, ఆడపడుచుల సడలని ఉద్యమ స్ఫూర్తి, వారు అనుసరిస్తున్న శాంతియుత పంథా చూసి తెలుగువాళ్లు గర్విస్తున్నారని తెలిపారు. రోడ్డునపడ్డ రైతులకు అండగా ఉంటానని గతంలోనే మాటిచ్చానని, ఈ నెల 10 తర్వాత మరోసారి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని చెప్పారు. రైతుల వాణి దేశం నలుమూలలా వినిపించేలా నినదిస్తానని, రైతుల ఉద్యమానికి మరోసారి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు చెప్పారు.
Go Back to Shorts
Pawan Kalyan
Janasena
Amaravati
Farmers

More Telugu News