ఆ సామెత చంద్రబాబు నైజాన్ని వర్ణించడానికే పుట్టింది: విజయసాయిరెడ్డి చురకలు

  • 'అంగిట బెల్లం ఆత్మలో విషం' అంటూ విమర్శలు
  • పైకి ఎక్కడాలేని ప్రేమ నటిస్తాడు
  • చేసేవి మాత్రం బీసీలను అణగదొక్కే పనులు
  • బీసీలు  ఉన్నత స్థాయి పదవుల్లో పనికి రారంటాడు 
బీసీలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి తీరు బాగోలేదంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీసీలను అణగదొక్కే పనులు చేస్తున్నారని ట్వీట్ చేశారు.

'అంగిట బెల్లం ఆత్మలో విషం అనేది చంద్రబాబు నైజాన్ని వర్ణించడానికే పుట్టింది. పైకి ఎక్కడాలేని ప్రేమ నటిస్తాడు. చేసేవి మాత్రం బీసీలను అణగదొక్కే పనులు. బీసీలు హైకోర్టు జడ్జిలుగా, ఉన్నత స్థాయి పదవుల్లో పనికి రారంటాడు. తన వర్గం తప్ప బీసీలు ఎప్పటికీ అధికార పీఠం దరిదాపులకు రాకుండా చేశాడు' అని ఆరోపణలు గుప్పించారు.

Vijay Sai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News