హిమాచల్‌ప్రదేశ్‌లో లోయలో పడిన ఆర్టీసీ బస్సు.. ఐదుగురి మృతి

  • చంబా జిల్లా సమీపంలో ఘటన
  • ఉత్తరాఖండ్ నుంచి హిమాచల్ వెళ్తున్న బస్సు
  • 35 మందికి గాయాలు
హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఉదయం ఉత్తరాఖండ్ నుంచి 40 మంది ప్రయాణికులతో హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీ బస్సు రాష్ట్రానికి బయలుదేరింది. చంబా జిల్లా సమీపంలోని జార్జ్ లోయ సమీపంలోకి రాగానే అదుపుతప్పి ఒక్కసారిగా లోయలోకి జారిపోయి బోల్తాపడింది.

ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చంబల్ మెడికల్ ఆసుపత్రికి తరలించారు.

Himachal Pradesh
Chamba
HRTC Bus
Gorge

More Telugu News