వైసీపీ ప్రభుత్వం తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం: జీవీఎల్‌

complaint againist YCP to election commission on local polls says GVL
  • విపక్ష అభ్యర్థులపై దాడులు సరికాదు
  • ముఖ్యమంత్రి జగన్‌ దీనిపై స్పందించాలి
  • మంత్రులు, ఎమ్మెల్యేలను కట్టడి చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏపీలో విపక్ష పార్టీల అభ్యర్థులపట్ల అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని, దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ అధికార ప్రతినిధి జి.వి.ఎల్‌.నరసింహారావు అన్నారు. ఈ రోజు ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రుల తీరు సరిగా లేదని, ఈ విషయంలో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. పరిస్థితులు చూస్తుంటే జగన్‌కు ప్రజాస్వామ్యంపై విశ్వాసం సన్నగిల్లినట్లు అనిపిస్తోందన్నారు.
Go Back to Shorts
West Godavari District
GVL Narasimha Rao
Local Body Polls
election commission

More Telugu News