ఆరు మొట్టికాయలు, మూడు తలంటులు ఉండకపోతే జగన్ కు నిద్రపట్టదు: నారా లోకేశ్

Nara Lokesh slashes out Jagan
  • గ్రామాల్లో వైసీపీ రంగులు వేసేందుకు ప్రజాధనం వృథా చేశారు
  • ఆ రంగులు చెరిపేందుకు మరో పద్నాలుగు వందల కోట్లు
  • అలా అనుకోవడం సైకో మనస్తత్వంలో స్టేజ్ 2
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హైకోర్టులో మొట్టికాయలు, సుప్రీంకోర్టులో తలంటులు ఉండకపోతే జగన్ కి నిద్ర పట్టదంటూ వరుస ట్వీట్లలో ఎద్దేవా చేశారు. గ్రామాల్లోని ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసేందుకు రూ.1400 కోట్ల ప్రజా ధనం వృథా చేశారని, ఇప్పుడేమో ఆ రంగులు చెరిపేందుకు మరో పద్నాలుగు వందల కోట్లు ఖర్చు చేయాలని విమర్శించిన లోకేశ్, ఈ సొమ్మంతా ఎవరిదంటూ జగన్ ని ప్రశ్నించారు.

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా పనులు ఆగిపోవడంతో రాష్ట్రంలో పేదలు ఇబ్బంది పడుతుంటే, వారికి అండగా నిలవాల్సిందిపోయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, అర్థం చేసుకోవాలని మాట్లాడుతున్న జగన్, అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గ్రామాల్లో వైసీపీ రంగులు ఎలా వేశారో చెప్పాలని ప్రశ్నించారు. ‘అన్ని చోట్లా నా రంగులే ఉండాలి అనుకోవడం సైకో మనస్తత్వంలో స్టేజ్ 2’ అంటూ జగన్ పై లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP

More Telugu News