‘కరోనా’తో కాంగో మాజీ అధ్యక్షుడు ఒపాంగో మృతి

Congo ex president Opango died
  • నిన్న ఫ్రాన్స్ లో  మృతి చెందినట్టు సమాచారం
  • ‘కరోనా’ బారిన పడకముందు నుంచే ఒపాంగోకు ఆరోగ్య సమస్యలు
  • ప్రకటించిన ఒపాంగో కుటుంబసభ్యులు
కరోనా వైరస్ బారిన పడి కాంగో మాజీ అధ్యక్షుడు జాక్వెస్ జాక్వెన్ యోంబి ఒపాంగో (81) మృతి చెందారు. నిన్న ఫ్రాన్స్ లో ఆయన మృతి చెందినట్టు సమాచారం. ‘కరోనా’ బారిన పడడానికి ముందే ఆయన పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఒపాంగో కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, 1939లో ఒపాంగో జన్మించారు. ఆర్మీ ఆఫీసర్ గా ఆయన పని చేశారు. 1977-79 వరకూ కాంగో-బ్రెజావిల్లి ఉద్యమాన్ని నడిపించారు.  
Go Back to Shorts
Opango
Congo
Ex-president
death
Corona Virus

More Telugu News