ఈపీఎఫ్‌ ఖాతాదారులకు శుభవార్త: మూడు నెలల పీఎఫ్‌ మొత్తం చెల్లింపునకు కేంద్రం ఆదేశాలు జారీ

centre issue orders for claim PF amount
  • లాక్‌డౌన్‌ నేపథ్యంలో కార్మికులు, సంస్థల డబ్బు చెల్లింపునకు ముందుకు
  • రూ.15 వేల కంటే తక్కువ వేతనం ఉన్న వారికి ప్రయోజనం
  • ఎంప్లాయీ, ఎంప్లాయర్‌ వాటా రెండూ చెల్లింపు
ఈపీఎఫ్‌ ఖాతాదారులకు హామీ ఇచ్చినట్టే పీఎఫ్‌ మొత్తం చెల్లింపునకు సంబంధించి కేంద్రం కార్మిక శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆయా పరిశ్రమలు, సంస్థల్లో పనిచేస్తూ పీఎఫ్‌ ఖాతాదారులుగా కొనసాగుతున్న వారి మూడు నెలల పీఎఫ్‌ మొత్తాన్ని కేంద్రం జమ చేస్తుందని, ఇందుకోసం ఎలక్ట్రానిక్‌ చలానా కమ్‌ రిటర్న్‌ (ఈసీఆర్‌) సమర్పించి డబ్బులు క్లెయిమ్‌ చేసుకోవాలని కార్మిక శాఖను ఆదేశించింది.

లాక్‌డౌన్‌ కారణంగా పరిశ్రమల మూసివేత, కార్మికులకు వేతనాల కోత, ఉద్యోగాల నుంచి తొలగించడం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని మూడు నెలల పీఎఫ్‌ మొత్తాన్ని చెల్లించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. దీనివల్ల 79 లక్షల మంది ఖాతాదారులకు, 3.8 లక్షల చిన్న, సూక్ష్మ, పెద్ద సంస్థలకు ప్రయోజనం కలుగుతుంది. ఇందుకోసం కేంద్రంపై దాదాపు 4,800 కోట్ల రూపాయల భారం పడనుంది.
Go Back to Shorts
EPF
three months amount

More Telugu News