విశ్రాంత ఉద్యోగులకు పూర్తి పింఛన్ చెల్లించాలంటూ సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ

Chandrababu writes a letter to CM Jagan
  • ‘కరోనా’ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు
  • వయోభారంతో వచ్చే అనారోగ్య సమస్యలు ఉంటాయి
  • వారికి వైద్య ఖర్చులు ఉంటాయి కనుక మొత్తం పింఛన్ ఇవ్వాలి
‘కరోనా’ నేపథ్యంలో ఏపీలోని విశ్రాంత ఉద్యోగులకు పూర్తి స్థాయి పింఛన్ ఇవ్వకపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. ఈ మేరకు డిమాండ్ చేస్తూ సీఎం జగన్ కు ఓ లేఖ రాశారు. సుదీర్ఘకాలం ప్రభుత్వ సేవలందించిన వారిపై ఈ తరహా చర్యలు సబబు కాదని, వారికి పూర్తి స్థాయి పింఛన్ చెల్లించాలని అన్నారు.

పింఛన్ అందుకునే వాళ్లందరూ 60 ఏళ్లకు పైబడిన వారేనని, ఈ వయసు వారికి ‘కరోనా’ వ్యాపించే అవకాశాలు అధికం అని, వయోభారంతో వచ్చే అనారోగ్య సమస్యలకు వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కనుక వారికి పూర్తి స్థాయి పింఛన్ చెల్లించాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
letter

More Telugu News