సెహ్వాగ్ కంటే అతను గొప్పోడు.. కానీ బుర్ర లేదు: షోయబ్ అఖ్తర్

  • సెహ్వాగ్ కంటే ఇమ్రాన్ నజీర్ కు ఎక్కువ ప్రతిభ ఉంది
  • పాక్ క్రికెట్ బోర్డు కూడా అతన్ని సరిగా పట్టించుకోలేదు
  • నిలకడగా ఆడాలని తాను ఇచ్చిన సూచనను కూడా నజీర్ పట్టించుకోలేదు
పాకిస్థాన్ క్రికెటర్ ఇమ్రాన్ నజీర్ పట్ల ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ సానుభూతిని తెలియజేశాడు. భారత్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ కంటే, తన కంటే ఇమ్రాన్ నజీర్ చాలా ప్రతిభావంతుడని... అయితే అతనికి బుర్ర లేదని చెప్పాడు. పాక్ క్రికెట్ వ్యవస్థ కూడా అతని ప్రతిభను సరిగా పట్టించుకోలేదని తెలిపారు.

సెహ్వాగ్ కు ఉన్న మెదడు నజీర్ కు ఉందని తాను అనుకోవడం లేదని... అదే విధంగా నజీర్ కు ఉన్న ప్రతిభ సెహ్వాగ్ కు ఉందని భావించడం లేదని ఓ స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖ్తర్ చెప్పాడు.

ఒక మ్యాచ్ లో భారత్ పై ఇమ్రాన్ అద్భుతమైన సెంచరీ కొట్టాడని... నిలకడగా ఆడాలని తాను సూచించానని... కానీ, తన మాటను అతను పట్టించుకోలేదని తెలిపాడు. సెహ్వాగ్ కంటే గొప్ప ఆటగాడు నజీర్ లో ఉన్నాడని అభిప్రాయపడ్డాడు. అతన్ని పాక్ క్రికెట్ బోర్దు సరిగా ఉపయోగించుకోలేదని విమర్శించాడు. ఇమ్రాన్ నజీర్ పాక్ తరపున 8 టెస్టులు మాత్రమే ఆడి 427 పరుగులు చేశాడు. 79 వన్డేల్లో 1,895 రన్స్ సాధించాడు.

Shoib Akhtar
Pakistan
Imran Nazir
Virender Sehwag

More Telugu News