సందీప్ కిషన్ కూడా ఆ లిస్టులో చేరాడు!

  • యంగ్ హీరోలలో సిక్స్ ప్యాక్ క్రేజ్ 
  • సందీప్ కిషన్ తాజా చిత్రం 'ఏ వన్ ఎక్స్ ప్రెస్'
  • స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే సినిమా    
మన యంగ్ హీరోలలో సిక్స్ ప్యాక్ బాడీకి వుండే క్రేజే వేరు. ఒకళ్లని చూసి మరొకరు ప్రేరణ పొందుతూ ఈ ఆరు పలకల బాడీని మెయిన్ టైన్ చేస్తుంటారు. నిజానికి వాళ్ల కెరీర్లో అదొక ప్రత్యేకతగా కూడా మిగిలిపోతుంది. ఇక ఈ బాడీని తెచ్చుకోవడానికి హీరోలు చాలా కష్టపడాలి. క్రమం తప్పకుండా జిమ్ లో కష్టతరమైన వర్కౌట్స్ చేయడమే కాకుండా, ఆహార నియమాలు కూడా కఠినంగా పాటించాలి.

ఇప్పుడీ సిక్స్ ప్యాక్ బాడీ లిస్టులోకి యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా చేరాడు. ప్రస్తుతం తను 'ఏ వన్ ఎక్స్ ప్రెస్' అనే క్రీడల నేపథ్యంలో సాగే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో హాకీ ప్లేయర్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా కోసమే సందీప్ ఈ ఆరు పలకల షేప్ ని తెచ్చుకున్నట్టు తెలుస్తోంది.

Sandip Kishna
A1 Express
Six pack body

More Telugu News