వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Sensex ends 179 points high
  • 179 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 67 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 7 శాతం వరకు పుంజుకున్న బజాజ్ ఆటో
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. బ్యాంక్, మెటల్, ఫార్మా స్టాకుల అండతో మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 179 పాయింట్లు లాభపడి 34,911కి పెరిగింది. నిఫ్టీ 67 పాయింట్లు పుంజుకుని 10,311 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఆటో (6.89%), బజాజ్ ఫైనాన్స్ (5.34%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (4.14%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (3.76%), యాక్సిస్ బ్యాంక్ (3.13%).

టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.13%), ఓఎన్జీసీ (-0.99%), టీసీఎస్ (-0.92%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.70%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.50%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News