ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు: అనసూయ

I am not acting in mother role says Anasuya
  • హీరో సుమంత్ అశ్విన్ తల్లి పాత్రలో అనసూయ నటిస్తోందని వార్త
  • టీవీ షూటింగులకే హాజరు కావడం లేదన్న అనసూయ
  • కరోనా వల్ల షూటింగులకు వెళ్లడం లేదని వ్యాఖ్య
తెలుగు సినిమాలతో పాటు, టీవీ షోలతో అనసూయ దూసుకుపోతోంది. తాజాగా ఆమె గురించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. హీరో సుమంత్ అశ్విన్ కు తల్లి పాత్రలో అనసూయ నటిస్తోందనేదే ఆ వార్త. అయితే ఈ వార్తలను ఆమె ఖండించింది. ఈ వార్తలో నిజం లేదని తెలిపింది. కరోనా కారణంగా టీవీ షూటింగులకే తాను హాజరు కావడం లేదని... అలాంటప్పుడు సినిమా షూటింగులకు ఎలా హాజరవుతానని చెప్పింది.

నాగ్ అశ్విన్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అశ్విన్ తల్లిదండ్రులుగా ఇంద్రజ, శ్రీకాంత్ ను తీసుకున్నారు. అయితే, చెన్నైలో ఉంటున్న ఇంద్రజ కరోనా కారణాలతో హైదరాబాద్ షూటింగుకు రాలేనని చెప్పింది. దీంతో, ఆమె స్థానంలో అనసూయను తీసుకున్నారనే వార్తలు వచ్చాయి.
Go Back to Shorts
Anasuya
Tollywood

More Telugu News