తెరకెక్కనున్న ఆర్తి అగర్వాల్ బయోపిక్?

  • టాలీవుడ్ లో నడుస్తున్న బయోపిక్ ల హవా
  • ఇప్పటికే పలువురి జీవిత కథతో తెరకెక్కిన బయోపిక్ లు
  • ఆర్తి అగర్వాల్ బయోపిక్ తీయబోతున్నారంటూ ఫిల్మ్ నగర్ లో ప్రచారం
సినీ పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ లో పలు బయోపిక్ లు వచ్చాయి. తాజాగా ఫిల్మ్ నగర్ లో ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. దివంగత హీరోయిన్ ఆర్తి అగర్వాల్ జీవిత కథతో సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి టాలీవుడ్ టాప్ స్టార్లందరితో ఆర్తి నటించింది.

ఒక యువ హీరోతో ప్రేమలో పడటం, ఆ తర్వాత ఆ లవ్ బ్రేకప్ కావడం జరిగింది. అనంతరం అమెరికాకు వెళ్లిపోయింది. ఆ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం కోసం, బరువు తగ్గాలనుకుని లైపో ఆపరేషన్ చేయించుకుంది. అది వికటించడంతో ఆమె చనిపోయింది. ఆర్తి అగర్వాల్ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె బయోపిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.

Arthi Agarwal
Tollywood
Biopic

More Telugu News