రేపు బాధ్యతలను స్వీకరించనున్న సోము వీర్రాజు

  • విజయవాడలోని ఫంక్షన్ హాల్ లో పదవీ బాధ్యతల స్వీకరణ
  • ముఖ్య అతిథిగా హాజరుకానున్న రాంమాధవ్
  • ఇప్పటికే దూకుడుగా వ్యవహరిస్తున్న సోము వీర్రాజు
ఏపీ బీజేపీ చీఫ్ గా ఎంపికైన సోము వీర్రాజు రేపు బాధ్యతలను స్వీకరించనున్నారు. విజయవాడలోని ఓ ఫంక్షన్ హాల్లో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరగనుంది. కోవిడ్ నిబంధనలకు లోబడి ఈ కార్యక్రమాన్ని ముగించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ హాజరుకానున్నారు. ఆయనతో పాటు అఖిల భారత సంఘటన్ సహ కార్యదర్శి సతీష్ జీ కూడా రానున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి సునీల్ దేవధర్, వామరాజు సత్యమూర్తి, మధుకర్ తదితరులు దగ్గరుండి చూసుకుంటున్నారు.

మరోవైపు బాధ్యతలను స్వీకరించక ముందే సోము వీర్రాజు దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన ఇద్దరిపై ఆయన ఇప్పటికే వేటు వేశారు. ఈ నేపథ్యంలో, పార్టీ పగ్గాలను అధికారికంగా స్వీకరించిన తర్వాత ఆయన మరింత క్రియాశీలకంగా వ్యవహరించనున్నారని భావిస్తున్నారు.

Somu Veerraju
BJP
Ram Madhav

More Telugu News