బోయిన్ పల్లి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి భారీగా పొగలు... ఆఫీస్ రూమ్ దగ్ధం!

  • స్కూల్లో అగ్నిప్రమాదం
  • షార్ట్ సర్క్యూట్ కారణమని వెల్లడి
  • అదుపులోకి వచ్చిన పరిస్థితి
హైదరాబాదు బోయిన్ పల్లిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈ సాయంత్రం భారీగా పొగలు రావడంతో తీవ్ర కలకలం రేగింది. బోయిన్ పల్లి డైమండ్ పాయింట్ వద్ద ఉన్న ఈ స్కూల్లో అగ్నిప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు వెల్లడైంది. ఆఫీసు రూమ్ కాలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్ లోపల కొందరు సెక్యూరిటీ గార్డులు, అడ్మిన్ సిబ్బంది ఉన్నారు. అయితే వారందరూ సురక్షితంగా వెలుపలికి వచ్చారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చినట్టు తెలుస్తోంది.

Delhi Public School
Bowenpally
Fire Accident
Hyderabad

More Telugu News