తమ్మినేని సీతారాం పీఏ నంటూ మోసాలు.. స్పందించిన అసెంబ్లీ కార్యదర్శి!

  • నకిలీ ఐడీ కార్డుతో దందాలు చేస్తున్న సోమేశ్వరరావు
  • స్పీకర్ కార్యాలయానికి చేరిన వ్యవహారం
  • స్పీకర్ తో, అధికారులతో ఆయనకు సంబంధం లేదన్న అసెంబ్లీ కార్యదర్శి
ఏపీలో మంత్రులు, అధికారుల పేర్లు చెప్పుకుని మోసాలకు పాల్పడుతున్నవారి ఉదంతాలు ఎక్కువవుతున్నాయి. తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పీఏనని చెప్పుకుంటూ సోమేశ్వరరావు అనే వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడు. నకిలీ ఐడీ కార్డు ధరించి వివిధ కార్యాలయాల్లో తిరుగుతూ మోసాలకు పాల్పడుతున్నాడు. చివరకు ఈ విషయం స్పీకర్ కార్యాలయానికి చేరింది. దీనిపై అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు మాట్లాడుతూ, సోమేశ్వరరావు వ్యవహారంపై తమకు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. అతనికి అసెంబ్లీతో కాని, స్పీకర్ తో కాని, అధికారులతో కానీ ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

Tammineni Sitaram
Assembly Speaker
Dummy PA

More Telugu News