దేశంలో కరోనా విజృంభణ.. అప్‌డేట్స్‌

COVID19 tally crosses 61 lakh mark
  • గత 24 గంటల్లో దేశంలో 70,589 మందికి కరోనా 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 61,45,292
  • మృతుల సంఖ్య మొత్తం 96,318
  • ఇప్పటి వరకు 7,31,10,041 కరోనా పరీక్షలు  
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 61 లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశంలో 70,589 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 61,45,292 కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 776 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 96,318 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 51,01,398 మంది కోలుకున్నారు. 9,47,576 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
           
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 7,31,10,041 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,42,811 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News