ఏపీ కరోనా అప్ డేట్: 4,038 పాజిటివ్ కేసులు, 38 మరణాలు

AP Corona Virus Spreading Update
  • అత్యధికంగా పశ్చిమ గోదావరిలో 686 కేసులు
  • అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 86 మందికి పాజిటివ్
  • తాజాగా 5,622 మందికి కరోనా నయం
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తాజా బులెటిన్ వెలువడింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 4,038 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 686 కేసులు వచ్చాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 96 కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 38 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 9 మంది కరోనాతో మరణించారు. తాజాగా 5,622 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఓవరాల్ గణాంకాలు పరిశీలిస్తే... ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,71,503 కాగా, 7,25,099 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 40,047 మంది చికిత్స పొందుతున్నారు. అటు, మొత్తం మరణాల సంఖ్య 6,357కి పెరిగింది.
Go Back to Shorts
Corona Virus
Spread
Andhra Pradesh
Positive Cases
Deaths

More Telugu News