క్రికెట్‌లో కొత్త రూల్ పెట్టాలన్న సచిన్ టెండూల్కర్

Sachin suggets new rule for Cricket
  • హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల గాయపడుతున్న బ్యాట్స్ మెన్లు
  • హెల్మెట్ కచ్చితంగా పెట్టుకోవాలనే నిబంధన తీసుకురావాలన్న సచిన్
  • సచిన్ సూచనకు పలువురి మద్దతు
కాలక్రమంలో క్రికెట్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు కేవలం టెస్ట్ క్రికెట్ మాత్రమే ఉండగా... ఆ తర్వాత వన్డేలు, టీ20లు వచ్చాయి. ఇప్పుడు 10 ఓవర్ల లీగులకు కూడా సన్నాహకాలు చేస్తున్నారు. ఆట నిబంధనల్లో కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు మరో కొత్త రూల్ పెడితే మంచిదని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సూచించాడు.

బ్యాట్స్ మెన్లు బ్యాటింగ్ చేసేటప్పుడు వారికి ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. బౌలర్లు విసిరే బంతులు బౌన్స్ అయి వారి ముఖాలను తీవ్రంగా గాయపరుస్తుంటాయి. స్పిన్నర్లను ఎదుర్కొంటున్నప్పుడు కూడా గాయపడిన బ్యాట్స్ మెన్లు ఉన్నారు.

ఈ నేపథ్యంలో సచిన్ ఒక సూచన చేశాడు. ఫాస్ట్ బౌలర్ ను ఎదుర్కొనేటప్పుడైనా లేదా స్పిన్నర్ ను ఎదుర్కొనే సమయంలోనైనా బ్యాట్స్ మెన్లు కచ్చితంగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను తీసుకురావాలని సూచించాడు. ప్రొఫెనల్ స్థాయిలో ఆడే ప్రతి ఆటగాడు ఈ నిబంధనను పాటించాలని చెప్పాడు. సచిన్ చేసిన ఈ సూచనకు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు.
Go Back to Shorts
Sachin Tendulkar
Team India
New Rule

More Telugu News