ముగిసిన 19వ రౌండ్... ఆధిక్యంలోకి దూసుకెళ్లిన టీఆర్ఎస్

TRS gets into lead in Dubbaka
  • 13వ రౌండు నుంచి దూకుడు పెంచిన టీఆర్ఎస్
  • 19వ రౌండులో 425 ఓట్ల మెజార్టీ
  • 19వ రౌండు ముగిసే సరికి 251 ఓట్ల లీడింగ్
దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ లో టీఆర్ఎస్ అనూహ్యంగా పుంజుకుని... బీజేపీపై ఆధిక్యతను సాధించింది. 19వ రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత లీడింగ్ సాధించింది. 13వ రౌండ్ నుంచి వరుసగా అన్ని రౌండ్లలో టీఆర్ఎస్ లీడ్ సాధిస్తూ వచ్చిన నేపథ్యంలో... బీజేపీ క్రమంగా ఆధిక్యాన్ని కోల్పోతూ, చివరకు టీఆర్ఎస్ కంటే వెనుకపడిపోయింది.  

19వ రౌండులో టీఆర్ఎస్ పార్టీ 425 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. దీంతో, మొత్తంమీద బీజేపీపై 251 ఓట్ల మెజార్టీని సాధించింది. మరో నాలుగు రౌండ్ల కౌంటింగ్ మాత్రమే పెండింగ్ లో ఉండటంతో... అన్ని పార్టీలు తీవ్ర ఉత్కంఠలో ఉన్నాయి. కాసేపట్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు.
Go Back to Shorts
Dubbaka
TRS
Congress

More Telugu News