‘ఆదిపురుష్’పై వ్యాఖ్యలు.. నటుడు సైఫ్ అలీఖాన్ పై కోర్టులో న్యాయవాది పిటిషన్

petition on adipurush
  • ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' 
  • సినిమా కథ గురించి సైఫ్ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు
  • రాముడితో రావణుడు యుద్ధం చేయడం న్యాయమేనని వ్యాఖ్య
  • అభ్యంతరాలు తెలుపుతూ న్యాయవాది పిటిషన్
ప్రభాస్ తదుపరి సినిమాగా 'ఆదిపురుష్' తెరకెక్కనున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రూపొందిస్తోన్న ఈ సినిమా కథ గురించి సైఫ్ అలీఖాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ సినిమాలో ఆయన రావణుడి పాత్రలో నటిస్తున్నాడు. శ్రీ రాముడితో రావణుడు యుద్ధం చేయడం న్యాయమేనని, రావణుడిలో ఉన్న మానవీయ కోణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నామని సైఫ్ వ్యాఖ్యానించాడు.

అయితే, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పటికే సైఫ్ అలీఖాన్ క్షమాపణలు చెప్పాడు. ఈ క్రమంలో ఆయనపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు అయింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన హిమాన్షు శ్రీవాస్తవ అనే న్యాయవాది జౌన్‌పూర్ కోర్టులో ఈ పిటిషన్ వేస్తూ, రావణుడిపై సైఫ్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని తెలిపారు. దర్శకుడు ఓం రౌత్ పేరును కూడా ఆయన తన పిటిషన్ లో ప్రస్తావించారు.
Go Back to Shorts
petition
adi purush
Prabhas

More Telugu News