బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే: తనతో పాటు అరియానాను బయటికి తీసుకొచ్చిన లక్ష్మీరాయ్

  • బిగ్ బాస్ షోలో మరో ఎలిమినేషన్
  • అరియానా గ్లోరీ అవుట్
  • హౌస్ లో మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్లు
  • పోటీ రసవత్తరం
బిగ్ బాస్ నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలేలో మరో ఎలిమినేషన్ జరిగింది. ఈసారి బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అరియానా గ్లోరీ ఎలిమినేట్ అయింది. రెండో ఎలిమినేషన్ కోసం బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన ఐటమ్ భామ లక్ష్మీరాయ్ తన వెంట అరియానాను వెంటబెట్టుకుని వచ్చింది. దాంతో బిగ్ బాస్-4 ఫైనలిస్టుల్లో ఇద్దరు ఎలిమినేట్ కాగా, మరో ముగ్గురు టైటిల్ రేసులో మిగిలారు. అభిజీత్, అఖిల్, సొహైల్ లలో విన్నర్ ఎవరు అవుతారన్న దానిపై నాటకీయత నడుస్తోంది.

కాగా, ఈసారి క్యాష్ ఆఫర్ ను రూ.25 లక్షలకు పెంచనున్నట్టు తెలుస్తోంది. ఇంతకుముందు నటి ప్రణీత కంటెస్టెంట్లకు రూ.10 లక్షలు ఆఫర్ చేయగా ఎవరూ మొగ్గుచూపలేదు. ఈసారి మరో రూ.15 లక్షలు పెంచిన నేపథ్యంలో ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి!

Ariyana Glory
Second Elimination
Grand Finale

More Telugu News