ఆ విక్టరీ సింబల్ చూపిస్తూ పర్యటనలేంటి బాబూ?: విజ‌య‌సాయిరెడ్డి

vijay sai reddy slams chandrababu
  • శ్రీరాముని విగ్రహన్ని మీరు, మీ గ్యాంగ్ ధ్వంసం చేశారు
  • రామతీర్థం రామునితో రాజకీయాలు  చేస్తావా?
  • ఎన్ని చేసినా నువ్వు రావణాసురునివే
  • మతాల మధ్య మారణహోమం సృష్టించాలనుకుంటున్నావా?
టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. రామ‌తీర్థం శ్రీరాముడి విగ్ర‌హాన్ని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ధ్వంసం చేసిన నేప‌థ్యంలో అక్క‌డ రాజ‌కీయ నాయ‌కులు ప‌ర్య‌ట‌న‌లు జ‌రుపుతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు అక్క‌డ‌కు వెళ్లినప్ప‌టి ఫొటోను పోస్ట్ చేస్తూ విజ‌య‌సాయిరెడ్డి ఆరోప‌ణ‌లు గుప్పించారు.

'శ్రీరాముని విగ్రహన్ని మీరు మీ గ్యాంగ్ ధ్వంసం చేసి ఆ విక్టరీ సింబల్ చూపిస్తూ పర్యటనలేంటి బాబూ? రామతీర్థం రామునితో రాజకీయాలు  చేస్తావా? ఎన్ని చేసినా నువ్వు రావణాసురునివే. జనం చీదరించుకోవడంతో ఇప్పుడు మతాల మధ్య మారణహోమం సృష్టించాలని అనుకుంటున్నావా?' అని విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్నించారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
YSRCP
Chandrababu

More Telugu News