ఆసుప‌త్రి నుంచి గంగూలీ డిశ్చార్జ్‌!

BCCI Chief Sourav Ganguly discharged from Apollo Hospital
  • అపోలోలో చికిత్స తీసుకున్న గంగూలీ
  • యాంజియోప్లాస్టీ నిర్వహించిన వైద్యులు
  • ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉందని ప్ర‌క‌ట‌న
బీసీసీఐ అధ్య‌క్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో చేరిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు యాంజియోప్లాస్టీ నిర్వహించి గుండెకి రెండు స్టంట్‌లు వేశారు. ఆయ‌న‌ ఆరోగ్యం నిలకడగా ఉండ‌డంతో ఆయ‌న‌ను ఈ రోజు డిశ్చార్జ్ చేశారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉంద‌ని అపోలో ఆసుప‌త్రి డాక్ట‌ర్ రాణా దాస్‌గుప్తా తెలిపారు.  

కాగా, ఈ నెల‌ తొలి వారంలో తన ఇంట్లో గంగూలీ వ్యాయామం చేస్తుండగా ఛాతీ నొప్పి రావ‌డంతో ఆయ‌న‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం ఆయ‌న కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గ‌త బుధవారం మళ్లీ ఆయ‌న‌కు ఛాతీలో నొప్పి రావ‌డంతో కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆయ‌న‌కు అపోలోలో వైద్యులు చికిత్స అందించారు.
Go Back to Shorts
Ganguly
bcci
Cricket

More Telugu News