'ఆదిపురుష్'లో మరో కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు

Vicky Koushal to play lakshman in Adipurush
  • ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్'
  • రాముడిగా ప్రభాస్.. లంకేశ్ గా సైఫ్
  • లక్ష్మణుడి పాత్రకు విక్కీ కౌశల్ ఎంపిక
  • షూటింగులో జాయిన్ కానున్న ప్రభాస్  
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలోనే నిర్మాణం జరుపుకుంటున్నాయి. వందలాది కోట్ల బడ్జెట్టుతో తెరకెక్కుతున్నాయి. వీటిలో స్ట్రెయిట్ హిందీ సినిమా 'ఆదిపురుష్' ప్రధానమైనది.  ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పలు విశేషాలను సంతరించుకుంటోంది.

రామాయణం ఆధారంగా సోషియో ఫాంటసీ చిత్రంగా దీనిని రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తుండగా.. లంకేశ్ గా విలన్ పాత్రలో హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఇక రాముడి తల్లి కౌసల్యగా హేమమాలిని, సీతగా కృతి సనన్ నటించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో మరో కీలక పాత్ర అయిన లక్ష్మణుడిగా బాలీవుడ్ నటుడు, 'ఉరి: ది సర్జికల్ స్ట్రయిక్' ఫేమ్ విక్కీ కౌశల్ ను ఎంపిక చేసినట్టు తాజా సమాచారం.

ఇక ఈ చిత్రం షూటింగుకి ముంబై స్టూడియోలో ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ప్రభాస్ ఈ షూటింగులో జాయిన్ అవుతాడట. ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ కు అధిక ప్రాధాన్యత ఉండడంతో ఇందుకోసం అంతర్జాతీయ నిపుణులు పనిచేస్తున్నట్టు చెబుతున్నారు.
Go Back to Shorts
Vicky Koushal
Prabhas
Om Routh
Kruti Sanon

More Telugu News