ట్రాన్స్‌జెండర్‌ను ద‌త్త‌త తీసుకుని పెంచిన ష‌కీలా.. టీవీ ప్రోగ్రాంలో త‌ల్లీకూతుళ్లు.. వీడియో ఇదిగో

Shakilas emotional moment with her daughter Milla
  • త‌మిళ ప్రోగ్రాం ‘కుకు విత్ కోమ‌లి’లో పాల్గొన్న ష‌కీలా
  • చాలా ఏళ్ల క్రితం మిల్లాను దత్తత తీసుకున్నానని వెల్లడి ‌
  • ప‌రిచ‌యం చేస్తూ షకీలా భావోద్వేగం
సినీ న‌టి ష‌కీలాకు పెళ్లి కాలేద‌న్న విష‌యం తెలిసిందే. ఒంట‌రిగా ఉండ‌డం ఇష్టం లేక ఆమె ఓ ట్రాన్స్‌జెండ‌ర్‌ను ద‌త్త‌త తీసుకునిపెంచుకుంది. తాజాగా, త‌మిళ ప్రోగ్రాం ‘కుకు విత్ కోమ‌లి’లో పాల్గొన్న ష‌కీలా తన కుమార్తెని తొలిసారి పరిచయం చేసింది.

ఆమె పేరు మిల్లా అని, ఆమె త‌న‌ కుమార్తె అని ఆమె చెప్ప‌గానే ప్రేక్ష‌కులు షాక్ అయ్యారు. అయితే, మిల్లా తన సొంత కూతురు కాదని, చాలా ఏళ్ల క్రితం ఆమెను దత్తత తీసుకున్నానని చెప్పింది. ఆమెను ప‌రిచ‌యం చేస్తూ షకీలా భావోద్వేగానికి గురయింది. ఆమెను త‌న‌ సొంత కూతురిలా పెంచుకున్నానని చెప్పింది.

తాను క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు మిల్లా త‌న‌కు తోడుగా నిలిచింద‌ని తెలిపింది. తాను కూడా ఆమెకు చాలా మ‌ద్ద‌తు ఇచ్చాన‌ని చెప్పింది. తానంటే ఆమెకు ఎంతో ప్రేమ అని తెలిపింది.  మిల్లా కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా ప‌నిచేస్తోంది.

 
Go Back to Shorts
shakila
Tollywood
Kollywood

More Telugu News