ఏపీలో మరో 2,765 కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు

  • ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ
  • గత 24 గంటల్లో 31,892 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 496 పాజిటివ్ కేసులు
  • పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరుగురికి పాజిటివ్
ఏపీలో గడచిన 24 గంటల్లో కరోనా ఉద్ధృతి మరింత పెరిగింది. 31,892 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,765 కొత్త కేసులు వెలుగు చూశాయి. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో పోటాపోటీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో 496 కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 490 కేసులు గుర్తించారు. కృష్ణా జిల్లాలో 341, విశాఖ జిల్లాలో 335, నెల్లూరు జిల్లాలో 292 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 6 కొత్త కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 1,245 మంది కరోనా నుంచి కోలుకోగా, రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 11 మంది మృత్యువాత పడ్డారు. ఏపీలో ఇప్పటివరకు 9,18,597 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,94,896 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 16,422 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 7,279కి చేరింది.

Andhra Pradesh
Corona Virus
Positive Cases
Deaths
Active Cases

More Telugu News