భద్రాచలంలో పాడైపోయిన లడ్డూలు... ఉద్యోగి జీతం నుంచి డబ్బు రికవరీ!

Ladoos Wasted in Bhadrachalam and Recovary from Employee
  • శ్రీరామనవమి సందర్భంగా బెల్లం లడ్డూల తయారీ
  • కరోనా కారణంగా భక్తులకు పంచని అధికారులు
  • పాడైపోయిన 4,260 కు పైగా లడ్డూలు
గత వారం జరిగిన శ్రీరామనవమి వేడుకల సందర్భంగా భక్తులకు పంచేందుకు సిద్ధం చేసిన దాదాపు 4,260కి పైగా బెల్లం లడ్డూలు పాడైపోవడంతో, ఆ డబ్బును సంబంధిత ఉద్యోగి నుంచి రికవరీ చేయాలని అధికారులు నిర్ణయించారు. వివరాల్లోకి వెళితే, శ్రీరామ కల్యాణం వైభవంగా జరిగిన తరువాత కరోనా కారణంగా భక్తులకు తీర్థ ప్రసాదాలను పంచలేదు.

దీంతో, బెల్లం లడ్డూలన్నీ పాడైపోయాయి. ఈ విషయంలో ఆలయ ఈఓ శివాజీ విచారణ జరిపించారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమని తేలుస్తూ, ఓఉద్యోగి వేతనం నుంచి రూ. 85,200 రికవరీ చేయాలని శివాజీ ఆదేశించారు.
Go Back to Shorts
Bhadrachalam
Laddoos
Recovary
Money

More Telugu News