రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు పూర్తి... గుంటూరు జిల్లా జైలుకు తరలింపు

  • రెండు రోజుల కిందట రఘురామకృష్ణరాజు అరెస్ట్
  • కులాల మధ్య ఉద్రిక్తతలు రేకెత్తిస్తున్నాడంటూ ఆరోపణలు
  • ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నాడని అభియోగాలు
  • నేడు గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు
  • నివేదిక రూపొందించిన మెడికల్ బోర్డు
  • జిల్లా కోర్టులో వైద్య నివేదిక సమర్పణ
కోర్టు ఆదేశాల మేరకు ఎంపీ రఘురామకృష్ణరాజుకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయననకు అన్ని రకాల వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం రఘురామను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. కోర్టు ఆయనను రమేశ్ ఆసుపత్రికి తరలించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ, పోలీసులు జిల్లా జైలుకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

కాగా, రఘురామకు నిర్వహించిన వైద్య పరీక్షలపై మెడికల్ బోర్డు నివేదిక రూపొందించింది. ఈ నివేదికను జిల్లా కోర్టులో సమర్పించారు. రఘురామను జిల్లా జైలుకు తీసుకువచ్చిన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రఘురామకు కోర్టు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

Raghu Rama Krishna Raju
District Prison
Guntur District
GGH
Medical Report
AP CID
YSRCP

More Telugu News