మహేశ్ ను మరింత స్టయిలిష్ గా చూపించనున్న త్రివిక్రమ్!

  • మహేశ్ తో త్రివిక్రమ్ మూడో మూవీ
  • కొత్త లుక్ తో కనిపించనున్న మహేశ్
  • కథానాయికగా అలరించనున్న పూజా హెగ్డే
మహేశ్ బాబు ఒక వైపున పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' చేస్తూనే, మరో వైపున త్రివిక్రమ్ ప్రాజెక్టును లైన్లో పెట్టేశాడు. ఈ సినిమా కథ ఎలా ఉంటుంది? మహేశ్ పాత్ర ఏమై ఉంటుంది? అనే ఆసక్తిని అభిమానులు కనబరుస్తున్నారు. అయితే ఇంతకుముందు లాక్ డౌన్ పెట్టినప్పుడే త్రివిక్రమ్ ఈ కథను రాసుకున్నారట. లైన్ సింపుల్ గానే అనిపించినప్పటికీ, ట్రీట్మెంట్ త్రివిక్రమ్ స్టైల్ లోనే ఉంటుందని అంటున్నారు. ట్రీట్మెంట్ విషయంలో త్రివిక్రమ్ కి తిరుగులేదు గనుక, ఇక ఆలోచించవలసిన అవసరం లేదు.

ఇక ఈ సినిమాలో మహేశ్ బాబును త్రివిక్రమ్ చాలా స్టయిలిష్ గా చూపించనున్నాడని అంటున్నారు. మహేశ్ లుక్ కొత్తగా ఉంటుందనీ, ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా వైవిధ్యంగా ఉంటుందని చెబుతున్నారు. ఇక త్రివిక్రమ్ తన సినిమాల్లో మాటలకు .. పాటలకు ఎంతో ప్రాధాన్యతని ఇస్తాడనే విషయం తెలిసిందే. త్రివిక్రమ్ .. మహేశ్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై సహజంగానే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది.

Trivikram Srinivas
Mahesh Babu
Pooja Hegde

More Telugu News