శవం దొరికితే చాలు రాబందులా వాలి రాజకీయం చేస్తున్నావు: చంద్రబాబుపై విజయసాయి ఫైర్

Vijayasai Reddy fires on Chandrababu
  • ఈ శవ రాజకీయాలు ఏంటి చంద్రబాబూ?
  • ఇంత దరిద్రపు ప్రతిపక్షం ఎక్కడా లేదు
  • డాక్టర్ సుధాకర్ కు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వలేదు?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శవాలపై పేలాలు ఏరుకునేవాడిలా ఈ శవ రాజకీయాలు ఏంటి చంద్రబాబూ? అని విమర్శించారు. శవం దొరికితే చాలు రాబందులా వాలి రాజకీయం చేస్తున్నావంటూ మండిపడ్డారు. ఇంత దరిద్రపు ప్రతిపక్షం ఎక్కడా లేదని అన్నారు. డాక్టర్ సుధాకర్ మృతితో ఆయన కుటుంబం విషాదంలో ఉంటే నీ పాలిట్రిక్స్ ఏమిటని ప్రశ్నించారు. అంత ప్రేమున్నోడివి ఆయన ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఎందుకివ్వలేదని అన్నారు.

మరో ట్వీట్ లో... 23వ తేదీ టీడీపీకి కాళరాత్రి అని విజయసాయి అన్నారు. రాష్ట్రానికి పట్టిన శని వదిలిన రోజని చెప్పారు. రెండేళ్ల క్రితం మే 23కే టీడీపీ అంతలా వణికిందని అన్నారు. గోడదెబ్బ-చెంపదెబ్బ అన్నట్టుగా ఈ ఏడాది జూలై 23 శుక్రవారం వస్తోందని... ఆరోజు పచ్చ పార్టీ పటాపంచలేనా? దేవుడు ఏం రాసిపెట్టాడో? అని  వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Vijayasai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News