నాలుగు రోజుల పర్యటనలో భాగంగా విశాఖ చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Venkaiah Naidu arrives Visakhapatnam for four day visit
  • స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు, అధికారులు
  • నేటి నుంచి ఈ నెల 29 వరకు వెంకయ్య పర్యటన
  • విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న వైనం
  • పోర్టు అతిథి గృహంలో బస
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నాలుగు రోజుల పర్యటన నిమిత్తం విశాఖపట్నం చేరుకున్నారు. ఆయనకు ఏపీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు,  తూర్పు నౌకాదళం అధిపతి వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్, నగర మేయర్ హరికుమారి, విశాఖ పోర్టు చైర్మన్ రామ్మోహనరావు, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, నగర పోలీస్ కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా తదితరులు స్వాగతం పలికారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 29 వరకు విశాఖలో జరిగే అనేక కార్యక్రమాల్లో వెంకయ్యనాయుడు పాల్గొంటారు. సతీసమేతంగా విచ్చేసిన ఆయన నగరంలో ఉన్నన్నాళ్లు పోర్టు గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు. విశాఖ వచ్చిన ఉపరాష్ట్రపతికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.
Go Back to Shorts
Venkaiah Naidu
Visakhapatnam
Visit
Andhra Pradesh

More Telugu News