దేశంలో కొత్తగా 42,015 క‌రోనా కేసులు

Media Bulletin on status of positive cases COVID19 in india
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,16,337
  • నిన్న‌ 3,998 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 4,18,480
  • మొత్తం 44,91,93,273 కరోనా పరీక్షలు  
దేశంలో నిన్న కొత్తగా 42,015  క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,16,337కు చేరింది. అలాగే, నిన్న 36,977 మంది కోలుకున్నారు.

మరణాల విషయానికొస్తే... నిన్న‌ 3,998 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,18,480కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,03,90,687 మంది కోలుకున్నారు. 4,07,170 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 41,54,72,455 వ్యాక్సిన్ డోసులు వేశారు.    
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 44,91,93,273 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 18,52,140 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News