ఏపీ రోజువారీ కరోనా కేసుల వివరాలు ఇవిగో!

  • గత 24 గంటల్లో 65,920 కరోనా పరీక్షలు
  • 1,747 కొత్త కేసుల నమోదు
  • 14 మంది మృతి
  • ఇంకా 22,939 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 65,920 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,747 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 293 కేసులు నమోదు కాగా, నెల్లూరు జిల్లాలో 239, తూర్పు గోదావరి జిల్లాలో 234, ప్రకాశం జిల్లాలో 223, పశ్చిమ గోదావరి జిల్లాలో 215 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 9 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 2,365 మంది కరోనా నుంచి కోలుకోగా, 14 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 19,50,339 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,14,177 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 22,939 మంది చికిత్స పొందుతున్నారు. అటు, తాజా మరణాలతో కలిపి 13,223 మంది కరోనాతో మృతి చెందారు.

Andhra Pradesh
Corona Virus
New Cases
Deaths
Bulletin

More Telugu News