ఏపీలో మరో 2,145 మందికి కరోనా పాజిటివ్

AP Corona bulletin
  • గత 24 గంటల్లో 82,297 కరోనా పరీక్షలు
  • తూర్పు గోదావరిలో 428 కేసులు
  • విజయనగరం జిల్లాలో 28 కేసులు
  • రాష్ట్రంలో 24 మంది మృతి
  • ఇంకా 20,302 మందికి చికిత్స
రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 82,297 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,145 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 428 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 369, నెల్లూరు జిల్లాలో 304 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 28 కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రంలో 2,003 మంది కరోనా నుంచి కోలుకోగా, 24 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 13,468కి పెరిగింది.

ఏపీలో ఇప్పటిదాకా 19,76,141 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,42,371 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 20,302 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
New Cases
Deaths

More Telugu News