విడుదలకు రెడీ అవుతున్న 'బజార్ రౌడీ'

  • రౌడీ పాత్రలో సంపూ 
  • కీలక పాత్రలో సాయాజీ షిండే
  • దర్శకుడిగా వసంత నాగేశ్వరరావు  
  • ఈ నెల 20వ తేదీన రిలీజ్  
సంపూర్ణేశ్ బాబుకి మంచి క్రేజ్ ఉంది .. ఆయన సినిమాల పట్ల యూత్ లో ఆసక్తి ఉంది. అందువలన గ్యాప్ లేకుండా ఆయన తన కెరియర్ ను నెట్టుకొస్తున్నాడు. కామెడీ చేయడంలో సంపూర్నేశ్ కి ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంది. అదే ఆయన అభిమానుల సంఖ్యను పెంచుతూ వెళుతోంది. ఆయన తాజా చిత్రంగా 'బజార్ రౌడీ' సినిమా రూపొందింది.

వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, రౌడీగా సంపూ నవ్వులు పూయించనున్నాడు. పాటలు .. ఫైట్లు .. డాన్సులు అన్నీ కూడా కామెడీకి ఎంత మాత్రం తగ్గకుండా ఉంటాయట. సంపూ కెరియర్లోనే ఇది భారీ బడ్జెట్ చిత్రమని చెబుతున్నారు. ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు.

గతంలో రాజేంద్రప్రసాద్ సినిమాలకు ఎక్కువగా సంభాషణలు అందించిన మరుధూరి రాజా ఈ సినిమాకి మాటలు రాశారు. ఆయన సంభాషణలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాలో, సాయాజీ షిండే .. పృథ్వీ .. నాగినీడు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Sampoornesh Babu
Naginneedu
Sayaji Shinde

More Telugu News