టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డితో ప్ర‌మాణం చేయించిన‌ ఈవో జవహర్‌ రెడ్డి

subba reddy takes oath as ttd chairman
  • శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో కార్యక్రమం
  • టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి రెండోసారి ప్ర‌మాణం  
  • త్వరలోనే టీటీడీ బోర్డు సభ్యుల నియామ‌కం
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డితో ఈవో జవహర్‌ రెడ్డి ప్రమాణం చేయించారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో ఈ కార్యక్రమాన్ని నిర్వ‌హించారు. టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్ర‌మాణం చేయ‌డం ఇది రెండోసారి. ఈ కార్యక్ర‌మానికి ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డితో పాటు ప‌లువురు నేత‌లు హాజ‌ర‌య్యారు.

ఇక త్వరలోనే టీటీడీ బోర్డు సభ్యులను కూడా నియమించ‌నున్నారు. వైవీ సుబ్బారెడ్డి తొలిసారి 2019, జూన్‌ 21న టీటీడీ ఛైర్మ‌న్‌గా నియమితులైన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో మొత్తం 37 మంది పాలకమండలి సభ్యులను నియమించారు. జూన్‌ 21వ తేదీ నాటికి వారి ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో కొత్త పాల‌క మండలి నియామ‌క ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.  
Go Back to Shorts
YV Subba Reddy
YSRCP
TTD

More Telugu News