ఏపీలో తాజాగా 1,535 మందికి కరోనా పాజిటివ్

AP Corona positive cases and deaths update
  • గత 24 గంటల్లో 69,088 కరోనా పరీక్షలు
  • తూర్పు గోదావరి జిల్లాలో 299 కేసులు
  • కర్నూలు జిల్లాలో 8 కేసులు
  • రాష్ట్రంలో 16 మంది మృతి
  • ఇంకా 18,210 మందికి చికిత్స
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 69,088 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 1,535 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 299 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 237, నెల్లూరు జిల్లాలో 211 కేసులు గుర్తించారు. కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 8 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.

అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 2,075 మంది కరోనా నుంచి కోలుకోగా, 16 మరణాలు సంభవించాయి. తాజా మరణాలతో కలిపి ఏపీలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 13,631కి పెరిగింది. రాష్టంలో నేటివరకు మొత్తం 19,92,191 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,60,350 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 18,210 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Positive Cases
Deaths

More Telugu News