రాఖీ కట్టించుకోనన్న అన్న.. ఆత్మహత్య చేసుకున్న చెల్లి

  • కొన్నాళ్లుగా మాట్లాడుకోని అన్నాచెల్లెళ్లు 
  • రాఖీ కట్టేందుకు చెల్లెలు ప్రయత్నించగా నిరాకరించిన అన్న
  • ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న చెల్లెలు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రక్షాబంధన్ సందర్భంగా రాఖీ కట్టించుకోవడానికి అన్న నిరాకరించడంతో... తీవ్ర మనోవేదనకు గురైన చెల్లెలు ఆత్మహత్యకు పాల్పడింది.

వివరాల్లోకి వెళ్తే రమేశ్, మమత (20) అన్నాచెల్లెళ్లు. జహీరాబాద్ లోని చెన్నారెడ్డి నగర్ లో తండ్రి బసవన్నతో కలిసి అద్దె ఇంట్లో నిసిస్తున్నారు. కొన్నాళ్లుగా అన్నాచెల్లెళ్లు మాట్లాడుకోవడం లేదు. అయితే నిన్న ఉదయం రాఖీ కట్టేందుకు మమత ప్రయత్నించగా.. రమేశ్ నిరాకరించాడు. ఆ తర్వాత తండ్రితో కలిసి రమేశ్ పొలానికి వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మమత ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.

Brother
Sister
Rakhi
Suicide

More Telugu News