తాలిబన్లకు మద్దతుగా మాట్లాడిన జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా

Farooq Abdulla talks in favour of Talibans
  • మంచి పాలన అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేసిన అబ్దుల్లా
  • ఇస్లామిక్ నియమాల ఆధారంగా ఉన్నతమైన పాలన అందిస్తారని వ్యాఖ్య
  • మానవ విలువలను కాపాడాలని కోరుతున్నానన్న అబ్దుల్లా
ఆఫ్ఘనిస్థాన్ ను చేజిక్కించుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లపై అందరూ భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మాత్రం తాలిబన్లను పొగుడుతూ వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లకు మద్దతుగా ఆయన మాట్లాడారు.

తాలిబన్లు మంచి పాలన అందిస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇస్లామిక్ నియమాల ఆధారంగా తాలిబన్లు ఉన్నతమైన పాలన అందిస్తారని అన్నారు. కొత్తగా ఏర్పాటైన తాలిబన్ నాయకత్వం మానవ విలువలను కాపాడాలని కోరుతున్నానని చెప్పారు.
Go Back to Shorts
Farooq Abdullah
NC
Jammu And Kashmir
Taliban

More Telugu News