విజయవాడలో కనకదుర్గమ్మను దర్శనం చేసుకున్న సోనూ సూద్

Sonu Sood visits Kanakadurga temple in Vijayawada
  • విజయవాడలో సోనూసూద్ పర్యటన
  • అంకుర హాస్పిటల్ ను ప్రారంభించిన సోనూ
  • కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు
  • అభిమానుల కోలాహలం
ప్రముఖ నటుడు, మానవతావాది సోనూ సూద్ నేడు విజయవాడలో పర్యటించారు. నగరంలో అంకుర సూపర్ స్పెషాలిటీస్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అటు, బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయాన్ని కూడా సందర్శించారు. సోనూ సూద్ కు ఆలయ వర్గాలు స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా సోనూ సూద్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితుల నుంచి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

సోనూ సూద్ రాకతో బెజవాడలో సందడి వాతావరణం కనిపించింది. ఆయన ఎక్కడికి వెళ్లినా వందల సంఖ్యలో అభిమానులు చుట్టుముట్టడంతో కోలాహలం నెలకొంది. రియల్ హీరో అంటూ అభిమానులు నినాదాలతో హోరెత్తించారు.
Go Back to Shorts
Sonu Sood

More Telugu News