ఏ పండుగకు లేని ఆంక్షలు వినాయకచవితికే ఎందుకు?: అశోక్ గజపతిరాజు

Ashok Gajapathi Raju slams govt
  • కరోనా ఆంక్షలు అన్నింటికీ ఒకేలా ఉండాలని వ్యాఖ్య 
  • అన్ని మతాలను గౌరవించాలని హితవు
  • దొంగలను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలని వ్యాఖ్యలు
  • ప్రభుత్వంలో పారదర్శకత లేదని విమర్శలు
టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తాజా పరిణామాలపై స్పందించారు. ఏ పండుగకు లేని ఆంక్షలు వినాయకచవితికే ఎందుకని ప్రశ్నించారు. కరోనా ఆంక్షలు అన్నింటికి ఒకే విధంగా ఉండాలని అన్నారు. అన్ని మతాలను గౌరవించాలని రాజ్యాంగం చెబుతోందని, ఆ ప్రకారమే నడుచుకోవాలని పేర్కొన్నారు. అందరినీ సమానంగా చూడడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.

కోర్టు ఆదేశాలు లేకపోతే ఈ పాటికి ఎంతమందిని జైల్లో పెట్టేవారో! అని అశోక్ వ్యాఖ్యానించారు. దొంగలను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచనందుకే ఈ దుస్థితి వచ్చిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో పారదర్శకత లేకుండా పోయిందని అన్నారు. ప్రభుత్వ జీవోలను కూడా ప్రజలకు అందుబాటులో పెట్టడంలేదని ఆరోపించారు.
Go Back to Shorts
Ashok Gajapathi Raju
Vinayaka Chavithi
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News