టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు ప్రభుత్వం నోటీసులు

Govt notices to TDP leader Dhulipalla Narendra
  • నోటీసులు జారీ చేసిన దేవాదాయశాఖ కమిషనర్
  • సెక్షన్ 6-ఏ కింద నోటీసులు
  • ట్రస్టు స్వాధీనంపై వివరణ కోరిన వైనం
  • వారం రోజుల్లో నోటీసులపై స్పందించాలని స్పష్టీకరణ
టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు ఏపీ ప్రభుత్వం తాజాగా నోటీసులు పంపింది. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ను స్వాధీనం చేసుకునే క్రమంలో నోటీసులు జారీ చేసింది. సహకార చట్టంలోని సెక్షన్ 6-ఏ కింద ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. కాగా ఈ నోటీసులను రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హరిజవహర్ లాల్ జారీ చేశారు. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. ధూళిపాళ్ల ట్రస్టు ఆధ్వర్యంలో డీవీసీ ఆసుపత్రి నడుస్తోంది.
Go Back to Shorts
Dhulipala Narendra Kumar
Notice
Trust
AP Govt

More Telugu News